రైతు భరోసా పథకం పై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు. వ్యవసాయం చేసే భూములకే రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన చిట్ చాట్ లో పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నీటి పారుదల శాఖపై శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. దీనిపై రూ.16వేల కోట్ల అప్పులు చెల్లించాల్సి ఉంది. అనవసరమైన టెండర్లు రద్దు చేస్తాం.
సాగులో ఉన్న భూములకు పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. నేషనల్ హైవేలు, రియల్ ఎస్టేట్ భూములకు, అనర్హులకు అస్సలు ఇవ్వమని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడి సాయం అందాల్సింది రైతులకు అని తెలిపారు. ఇలా అన్ని విషయాలపై చర్చ చేసి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల రుణాలను మాఫీ చేస్తామని.. బ్యాంకర్లతో చర్చలు జరుగుతున్నాయని సీఎం తెలిపారు.