సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు ఇప్పలపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న జ్యోతిబాపూలే బీసీ గురుకుల హాస్టల్‌లో 34మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారని… తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కొందరిని పేరెంట్స్‌కు అప్పజెప్పారని విజయశాంతి ఫైర్ అయ్యారు. కొన్ని రోజులుగా అన్నంలో లక్క పురుగులు వస్తున్నయని స్టూడెంట్లు చెబుతున్నరు. ఆదివారం చాలామంది అస్వస్థతకు గురయ్యారని తెలిసి ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. కలెక్టర్ రావాలంటూ నినాదించారు. కొందరు పేరెంట్స్కూడా ఆందోళనలో పాల్గొన్నారని గుర్తు చేశారు.
అలాగే హాస్టల్ భవనం కూడా ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉంది. బియ్యంలో పురుగులు, మెరిగెలు వస్తున్నయి. బీసీ గురుకుల హాస్టల్‌కు పక్కా భవనం మంజూరు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. వారం క్రితం గురుకులంలో 367 మంది స్టూడెంట్స్ ఉండగా 140 మంది సిక్ లీవ్ తీసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. జ్వరాలు ప్రబలడంతో పేరెంట్స్‌లోనూ ఆందోళన నెలకొంది. ఆదివారం మరికొందరు వచ్చి వారి పిల్లలను ఇండ్లకు తీసుకువెళ్లారు. దీంతో హాస్టల్ సగం ఖాళీ అయ్యింది. ఈ హాస్టల్‌ను పాత భవనంలో నిర్వహిస్తున్నారన్నారు.
చీకటి గదుల్లో క్లాస్‌లు జరుగుతున్నయి. చన్నీళ్లతోనే స్టూడెంట్లు స్నానం చేయాల్సి వస్తోంది. దోబీ కూడా లేడు. ఇంతా జరుగుతున్నా అధికారులు ఫుడ్ పాయిజన్ కాలేదని బుకాయించడం దారుణం. దీన్నిబట్టే విద్యార్థులపై ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు. సాక్షాత్తు మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోనే ఇలా జరిగితే… ఇక రాష్ట్రమంతటా పరిస్థితి ఎలా ఉందో తెలుస్తూనే ఉంది. రానున్న ఎన్నికల్లో ఈ అరాచక పాలనను అంతమొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారని విజయశాంతి ఫైర్ అయ్యారు.