వెంటనే ఫామ్ హౌస్ కు రండి.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఆదేశం

-

మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాజీ సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు రావాలని ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ సమాచారం అందించింది.. తాజా రాజకీయ పరిస్థితులపై ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు కేసీఆర్. దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు బయలు దేరారు.

Former CM KCR’s call to BRS MLAs

కానీ పఠాన్‌ చెరూ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాత్రం ఢిల్లీఓ ఉన్నారు. ఢిల్లీలో పటాన్ చెరు BRS ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రత్యక్షం అయ్యారు. ఢిల్లీలోని తాజ్ హోటల్ లో బస చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..ఎవరికీ చెప్పకుండా ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. ఈడీ విచారణ కోసం పటాన్ చెరు BRS ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం అందుతోంది. ఈ నెల 20న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుల ఇంట్లో సోదాలు చేసింది ఈడీ. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించినట్టు ఈడీ ప్రకటన చేసింది. దీంతో ఈడీ విచారణ కోసం పటాన్ చెరు BRS ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version