మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో ఆయన సీఎంను కలిశారు. ఈ సమయంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. తీగల కృష్ణారెడ్డి టీడీపీ నుంచి హైదరాబాద్ మేయర్‌గా పని చేశారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు.
2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు వరుసగా బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది.