కొంగరకలాన్​లో నేడు ఫాక్స్‌కాన్‌కు భూమిపూజ

-

తెలంగాణ ఐటీ, పరిశ్రమల రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే రాష్ట్రానికి వందల కొద్ది అంతర్జాతీయ కంపెనీలు వచ్చాయి. వాటి పరిశ్రమలను ఇక్కడ నెలకొల్పాయి. తాజాగా వాటి జాబితాలో ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ సంస్థ ఫాక్స్‌కాన్‌ చేరింది. ఈ సంస్థను రాష్ట్రంలో నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది.

రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌ గ్రామంలో ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ఫాక్స్‌కాన్‌ సంస్థ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. రూ.1,655 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

ఫాక్స్​కాన్ సంస్థ నిర్మాణం పూర్తయితే సుమారు 35 వేల మందికి పైగా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంస్థ ప్రతినిధులు గతంలోనే ప్రకటించారు. సంస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 196 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ సంస్థను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ఫాక్స్​కాన్ సంస్థకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news