80 కోట్ల మందికి ఉచిత రేషన్.. జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు

-

పదేళ్లలో ప్రధాని మోడీ దేశ రాజకీయ సంస్కృతిని పూర్తిగా మార్చేశారని.. కానీ కాంగ్రెస్ ఇప్పటికీ దేశాన్ని విభజించు, పాలించు రీతిలోనే రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం బీజేపీ చౌటుప్పల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మోడీ ఆధ్వర్యంలో భారత్ ఆత్మనిర్భర్ గా మారిందని, ప్రపంచంలో ఐదో అతిపెద్ద వ్యవస్థగా భారత్ అవతరించిందని అన్నారు. మోడీ హయంలో దేశంలో పేదరికం తగ్గిందని.. దేశంలోని 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందిస్తున్నామని తెలిపారు.

పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆర్థిక సహయం చేస్తున్నామని చెప్పారు. కరోనా క్లిష్ట సమయాన్ని మోడీ ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొందని గుర్తు చేశారు. ఆటో మొబైల్ రంగంలోనూ భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని, పేదళ్ల క్రితం మన ఫోన్లపై మేడిన్ చైనా, మేడిన్ కొరియా అని ఉండేదని.. ఇప్పుడు మాత్రం మనం వాడుతోన్న ఫోన్లపై మాత్రం మేడిన్ ఇండియా అని ఉంటోందన్నారు. మోడీ నేతృత్వంలో వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version