మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన గంగుల కమలాకర్

Join Our Community
follow manalokam on social media

గత కొద్దిరోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో నిలుస్తున్న మంత్రి గంగుల కమలాకర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం రోజు చెబుతున్నా మనం కేసీఆర్ ను కాపాడుకోవాలని ఆయన అన్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటామని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు జగనన్న బాణం షర్మిల వస్తోంది…తర్వాత మెల్లగా జగన్ వస్తాడు ఆ తర్వాత చంద్రబాబు కూడా వస్తాడని ఆయన మళ్ళీ అన్నారు.

అలా జరిగితే తెలంగాణలో మళ్లీ కొట్లాటలు,విధ్వంసాలు,ఫ్యాక్షన్  తప్పవని అన్నారు. ఆంధ్ర పెత్తనం వస్తే మళ్లీ మనకు కష్టాలు తప్పవు..ఇప్పటికే తెలంగాణ బాగా అభివృద్ధి చేసుకున్నామని ఆయన అన్నారు. అన్న,చెల్లెల్లకు గొడవలు ఉంటే మీరు మీరు చూసుకోండి…మాపై ఎందుకు రుద్దడం ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు. మరి ఈ అంశం మీద షర్మిల ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....