ఇండియాలో బంగారం ధరలు చుక్కలు చూపిస్తోన్నాయి. బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పెరిగిన ధరలు పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం వివాహ ముహూర్తాలు ఉండటంతో బంగారానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు కూడా బంగారం ధరలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి బంగారం ధరలు కొండెక్కుతున్నాయి.
తాజాగా మరో సారి బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,250 కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50, 450 కి చేరింది. మరోవైపు వెండి ధరలు మాత్రం క్రమంగా పెరుగుతున్నాయి. పెరుగుదలలో బంగారంతో పోటీ పడుతున్నాయి. కిలో వెండి ధర రూ. 800 కి పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.64,500 గా నమోదు అయింది.