రైతులకు గుడ్ న్యూస్.. రూ.లక్షపైన రుణాలు మాఫీ

-

తెలంగాణలో రైతు రుణమాఫీ పై మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.99,999 లోపు రుణాలను మాఫీ చేశామని.. రూ.1లక్షకి పైగా ఉన్న రుణాలను మాఫీ ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు మంత్రి హరీశ్ రావు. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అకౌంట్ పని చేయకుంటే వారి అకౌంట్ ఆపరేషన్ లైజ్ చేసి మాఫీ జరిగేలా చేస్తామని చెప్పారు. 

 

ఇవాళ మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. 30లక్షల కుటుంబాలకు రుణమాఫీ జరిగిందని.. ఇచ్చిన మాట ప్రకారం.. రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ప్రతీ రైతుకు రుణమాఫీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని.. ఆయన ఆదేశిస్తే ఆచరిస్తామన్నారు. బీఆర్ఎస్ పథకాలను చూసి కాంగ్రెస్ నేతలు బేజారవుతున్నారని పేర్కొన్నారు.కేసీఆర్‌ను తిట్టడానికి ప్రతిపక్షాలు పోటీపడుతున్నాయని.. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అని కాంగ్రెస్ నేతలు చూస్తున్నాయన్నారు. బీజేపీ క్యాడర్ కోసం వెతుకులాడుతున్నారని విమర్శించారు. మైనార్టీలకు రూ.లక్ష చెక్కులు పంపిణీ చేశామన్నారు మంత్రి హరీశ్ రావు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version