సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం… ఆ రైతులందరికీ జులై 5 నుంచి రైతుబంధు

-

తెలంగాణ రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారా సీఎం కేసీఆర్. పోడు భూముల పట్టాలు పొందిన రైతులకు జూలై 5వ తేదీ నుంచి రైతుబంధు సాయం అందించేందుకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం అధికారులు జులై 4వ తేదీ వరకు వివరాలు నమోదు చేయనున్నారు.

రైతుల పేర్లు, పట్టా నెంబర్, విస్తీర్ణం, బ్యాంకు అకౌంటు, మొబైల్ నెంబర్ లాంటి వివరాలు సరిచూసుకొని జులై 5వ తేదీన రైతుబంధు డబ్బులను ఖాతాలలో జమ చేయనున్నారు అధికారులు. కాగా దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, నిన్న సీఎం కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గిరిజనులకు పోడు భూముల పట్టాలను విడుదల చేశారు సీఎం కేసీఆర్. నాలుగు లక్షల ఆరువేల ఎకరాల పట్టాలు లక్షన్నర మంది గిరిజనులకు పంపిణీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version