సిరిసిల్లా నేతన్నలకు శుభవార్త..6.22 కోట్ల మీటర్ల బతుకమ్మ చీరల ఆర్డర్

-

సిరిసిల్ల నేత కార్మికులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఏటా అందించే బతుకమ్మ పండుగ కానుక చీరల రంగులను, డిజైన్లను తెలంగాణ పవర్ లూమ్ టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఖరారు చేసింది.

21 రంగుల్లో 25 డిజైన్లలో బతుకమ్మ చీరలను ఆర్డర్ చేసింది. రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు బతుకమ్మ కానుకగా చీరలను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది.

మగ్గాల సంఖ్య ఆధారంగా ఆర్డర్లు ఇస్తాం

సిరిసిల్ల నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చాము. 21 రంగుల్లో 25 డిజైన్లలో చీరలను ఉత్పత్తి చేయాలని స్పష్టం చేశాము. మ్యాక్స్‌ సంఘాలు, ఎస్‌ఎస్‌ఐ యూనిట్లలోని మరమగ్గాల సంఖ్య ఆధారంగా వస్త్రోత్పత్తిదారులకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తాం. గడువులోగా చీరలను ఉత్పత్తి చేసి అందించాల్సి ఉంటుంది.– సాగర్, జౌళిశాఖ, ఏడీ.

Read more RELATED
Recommended to you

Latest news