హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్, వరద సాయం అందిస్తున్నారు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వరద సహాయం విషయంలో ఇప్పుడు కాస్త విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల తర్వాత వరద సహాయం అందించడం లేదు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఈ నేపధ్యంలో గ్రేటర్ హైదరాబాద్ కమీషనర్ లోకేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరద బాధితులకు ఆర్థిక సహయం అందించడంలో జీహెచ్ఎంసీ నిస్సహాయత వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేసారు.

గ్రేటర్ హైదరాబాద్ లో వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ మంగళవారం నుండి ప్రారంభమైనదని ఆయన అన్నారు. ఒక్క మంగళవారం నాడే 7939 మంది బాధితులకు రూ. 7 .949 కోట్లను సంబంధిత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో తాము జమ చేసామని పేర్కొన్నారు. నగరంలో వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ కొనసాగుతుందని జీహెచ్ఎంసీ ఒక ప్రకటన విడుదల చేసింది.