తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశ వర్కర్లకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో 108, అమ్మఒడి వాహనాలను ప్రారంభించారు సీఎం కేసీఆర్. దీంతో అందుబాటులోకి 466 అంబులెన్స్‌లు వచ్చాయి.
ఈ సందర్భంగా తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ….ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు ఉచితంగా ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని నిర్ణయించిందని వెల్లడించారు. ఈనెల నుంచి వారి సెల్ఫోన్ బిల్లులను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. కొన్ని రాష్ట్రాలలో స్కాములు ఉంటే… తెలంగాణ రాష్ట్రంలో స్కీములు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే 108 ఉద్యోగులకు నాలుగు స్లాబులుగా వేతనాలు పెంచుతామని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. వచ్చే ఎన్నికలలో… కెసిఆర్ ప్రభుత్వం మరోసారి రాబోతుందని ఆయన తెలిపారు.