తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలోనే గ్రూప్ 2 నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. పట్టుమని పది నెలలు కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం లేదు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

ఈ మొన్ననే గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేసేందుకు కీలక ప్రకటన ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం మరో భారీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ నెలలో గ్రూప్ టూ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతుంది. దాదాపు 729 గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.