‘అత్యుత్తమ నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే’: కల్వకుంట్ల కవిత ట్వీట్

-

ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా సీఎం కేసీఆర్ కు పితృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత. సోషల్ మీడియాలో చురుకుగా వ్యవహరించే కల్వకుంట్ల కవిత సందర్భానుసారం కుటుంబ ఆప్యాయతానుబందాలను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా ఆదివారం ట్విటర్ వేదిక ద్వారా ఆమె స్పందించారు.” అత్యుత్తమ నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే” అని ఆమె ట్వీట్ చేశారు.

” నా జీవితంలో మీరే గొప్ప స్ఫూర్తి” అంటూ తండ్రి పై ప్రేమని చాటి చెప్పారు. హ్యాపీ ఫాదర్స్ డే అని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు సీఎం కేసీఆర్ తో కలిసి గతంలో దిగిన ఫోటోను ఈ సందర్భంగా ఆమె షేర్ చేశారు. కవిత పోస్ట్ పై పలువురు నెటిజన్లు స్పందించారు. హ్యాపీ ఫాదర్స్ డే విషెస్ తెలిపారు. కొన్ని ఆసక్తికరమైన పాత ఫోటోలను షేర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news