గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తారనుకుంటే.. నిరుద్యోగుల ఆశలపై నీళ్లుచల్లారు: హరీశ్‌రావు

-

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీరు చెప్పేది కొండంత చేసేది గోరంత కూడా లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా నర్సింగ్ ఆఫీసర్‌లకు నియామక పత్రాల అందజేత పేరిట ఆర్భాటం చేసి ఊహించినట్లు గానే తామే నియామకాలు చేసినట్లు డబ్బా కొట్టుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను వంచిందని ఎన్నికల ప్రచారంలో కల్లిబొల్లి మాటలు చెప్పిన రేవంత్ …బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియను తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ అబద్దాల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఇచ్చి, నియామక పత్రాలు ఇచ్చారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తారనుకున్న నిరుద్యోగుల ఆశలపై రేవంత్ రెడ్డి నీళ్లు చల్లారని ధ్వజమెత్తారు. ఆయన ప్రసంగంలో దీని గురించి ఒక్క మాటా లేదని మండిపడ్డారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకుంటే స్వాగతిస్తామని అన్నారు. సీఎం హోదాలో తప్పుడు మాటలు చెప్పి నిరుద్యోగులను రెచ్చగొట్టవద్దని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version