అమీన్ పూర్.. ఐలాపూర్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై కీలక కామెంట్స్ చేసారు. రేవంత్ ఏడాది పాలనలో ప్రజలపై దాడులు, ప్రతిపక్షాలకు తిట్లు, దేవుళ్లపై ఓట్లు ఆయన కుటుంబానికి మాత్రం నోట్లు అని అన్నారు. ఇక అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయ్యాడు అని పేర్కొన హరీష్ రావ్.. మూసిలో పేదల ఇల్లు కూల్చి, రైతు బంధు ఎగ్గొట్టి కూడా రేవంత్ హిట్ వికెట్ అయ్యాడు అని అన్నారు.
అలాగే ఢిల్లీలో మూడు రోజులు ఉంటే సీఎం రేవంత్ కి బీజేపీ మంత్రులు అపాయింట్ మెంట్ ఇచ్చారు. కానీ రాహుల్ గాంధీ ఇవ్వలేదు. ఢిల్లీలో, గల్లీలో సీఎం రేవంత్ పని అయిపోయింది. అందుకే ఫ్రస్టేషన్ లో ఉన్నాడు. సీఎం రేవంత్ ఏడాది పాలనలో అన్ని వర్గాల ప్రజలని మోసం చేశారు. ఇక అమలు కానీ హామీల కోసం దేవుళ్ల పై ఓట్లు వేసినందుకే మొన్న భూకంపం వచ్చింది అని హరీష్ రావ్ తెలిపారు.