మునుగోడు ప్రజలారా..ఉచితంగా మోటర్లు వాడుకునే టీఆర్‌ఎస్ కావాలా, మోటర్లకు మీటర్లు పెట్టే బీజేపీ కావాలా తేల్చుకోండని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మునుగోడు లో బిజెపికి చెప్పుకోవడానికి ఏమి లేదని విమర్శలు చేశారు. గ్యాస్ సిలిండర్ ధర పెంచాము… అందుకోసం ఓటు వేయమని బిజెపి అడుగుతుందా ? అని ప్రశ్నించారు.
మోడీ సర్కార్ వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముడము మొదలుపెట్టిందని.. మహిళకు ,మైనార్టీలకు మోడీ హయాంలో రక్షణ లేదని మండిపడ్డారు హరీష్ రావు. చేనేత కార్మికుల కు ఉన్న అన్ని పథకాలను మోడీ సర్కార్ తీసివేసిందన్నారు.
మోడీ సర్కార్ ఒక్క మంచి పని చేసింది ? అని నిలదీశారు. క్షుద్రపూజలు మీకు అలవాటు…మాకు కాదని బండి సంజయ్ కు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. మునుగోడు ఉప ఎన్నిక బిజెపి తెచ్చిపెట్టిందని..మునుగోడు లో బిజెపి అధికార దుర్వినియోగం పాల్పడి గెలవాలని అనుకుటుందని వెల్లడించారు. నాయకులను కొనుగోలు చేయడమే కాదు…కార్లు ,మోటార్ సైకిళ్ళు నేతలకు బీజేపీ కొనిస్తదట అంటూ ఫైర్ అయ్యారు.