తెలంగాణలో భారీ వర్షాలు.. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ

-

తెలంగాణలో ఆదివారం విస్తృతంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. సోమవారం కూడా మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తున్నాయి.  తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని  ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒడియా, దక్షిణ చత్తీస్‌ఘఢ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాగల నాలుగు రోజుల్లో పశ్చిమ తీరం అంతటా రెడ్‌ అలర్ట్‌ జారీ చేశామని తెలిపారు. ఈరోజు, రేపు గుజరాత్‌, కొంకణ్‌, గోవా, మధ్య మహారాష్ట్ర, కోస్తా కర్నాటక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుందని  వెల్లడించింది.

ఉత్తరాదిని ఇటీవల భారీ వర్షాలు ముంచెత్తగా ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు ఉత్తరాఖండ్‌లో ఈరోజు, రేపు అతిభారీ వర్షాలు కరిసే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ సైంటిస్ట్‌ సోమా సేన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version