అత్యధిక విరాళాలు పొందిన ప్రాంతీయ పార్టీగా BRS

-

దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీల్లో ఐదు రాజకీయ పార్టీలు మాత్రమే విరాళాల్లో అత్యధిక వాటా దక్కించుకున్నాయని ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేస్తోన్న అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌) వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 26 ప్రాంతీయ పార్టీలకు రూ.189.80 కోట్ల నిధులు సమకూరినట్లు తెలిపింది. ఆయా పార్టీలు ఎన్నికల సంఘాని(ఈసీ)కి సమర్పించిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలను పేర్కొంది. ఇదే ఏడాదికి గాను ఏఐఏడీఎంకే, బీజేడీ, ఎన్‌డీపీపీ, ఎస్‌డీఎఫ్‌, ఏఐఎఫ్‌బీ, పీఎంకే, జేకేఎన్‌సీ పార్టీలు తమ విరాళాల వివరాలను వెల్లడించలేదని ఏడీఆర్‌ పేర్కొంది.

ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక విరాళాలు పొందిన రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) అగ్రస్థానంలో నిలిచింది. ఈ పార్టీకి 2021-22లో 14 విరాళాల ద్వారా రూ.40.90 కోట్లు సమకూరాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) 2,619 విరాళాల ద్వారా రూ.38.24 కోట్లు అందుకుని ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. జేడీ(యు) రూ.33.26 కోట్లతో తృతీయ స్థానంలో, రూ.29.80 కోట్లతో ఎస్పీ నాలుగో స్థానంలో, రూ.20 కోట్లతో వైఎస్సారసీపీ అయిదో స్థానంలో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version