గజ్వేల్ లో హింట్ అండ్ రన్ ఘటన..ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి

-

గజ్వేల్లో హిట్ అండ్ రన్.. చోటు చేసుకుంది. ఈ సంఘటన లో ఏకంగా ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి చెందారు. హైదరాబాద్ లో జరిగే మారథాన్లో పాల్గొనేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గజ్వేల్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయింది. ఇవాళ తెల్లవారుజామున బైక్ పై వెళ్తున్న ఇద్దరిని ఢీ కొట్టి వెళ్లిపోయింది గుర్తు తెలియని వాహనం.. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ స్పాట్ డెడ్ అయ్యారు.

Two constables died in an accident while going to participate in the marathon in Hyderabad

మృతులది సిద్దిపేట జిల్లా పెద్దాకోడూరు, గాడిచర్లపల్లి గ్రామంగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు వెంకటేష్, పరంధాములు. ఇక ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి చెందిన సంఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే.. ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి చెందడంతో.. వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version