తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అనగానే.. అందరికీ గుర్తుకు వచ్చేది ధమ్ బిర్యానీ అలాగే ఇరానీ చాయ్. హైదరాబాద్ మహా నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ.. బిర్యానీ తో సహా ఇరానీ చాయ్ తాగేందుకు ఆసక్తి చూపుతారు. నగరానికి వచ్చిన ఎవరైనా సరే.. ఇరానీ చాయ్ రుచి చూసే పోతారు.
రంగు, రుచి, చిక్కదనంతో పాటు.. దానిలోని మరేదో ప్రత్యేకత చాయ్ ప్రియులను కట్టిపడేస్తుంది. ఇప్పుడీ చాయ్ ధర కూడా పెరిగింది. నిత్యావసరాల ధరలు ఎడాపెడా పెరుగుతునన నేపథ్యంలో ఇరానీ చాయ్ ధరను కూడా రూ.5 పెంచేశారు.
ఫలితంగా ఇప్పటి వరకు రూ.15 గా ఉన్న కప్పు టీ ధర రూ.20 కి చేరంది. ఇరానీ చాయ్ పొడి ధర కిలో రూ.300 నుంచి రూ.500 కు పెరగడమే ఇందులో కారణమని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. అయితే.. రూ.20 పెరిగినప్పటికీ.. చాయ్ తాగేస్తామని చాయ్ ప్రియులు చెబుతున్నారు.