బిజెపి ముందస్తు ఎన్నికలు కోరుకుంటే మేము రెడీ – తలసాని

బిజెపి ముందస్తు ఎన్నికలు కోరుకుంటే మేము రెడీగా ఉన్నామని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.కేంద్ర ప్రభుత్వంను రద్దు చేస్తే అందరం కలిసి ఎన్నికలకు పోదాం అని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు.ఎవరు ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారు అని కేసీఆర్ చెప్పారని,కానీ బండి సంజయ్ ఏది పడితే అది మాట్లాడ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పొడు భూముల సమస్య తీర్చాలీసింది కేంద్ర ప్రభుత్వమని అన్నారు.పోడు భూములపై విపక్షాలు ఎందుకు ధర్నాలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఒక్క లక్ష రూపాయలు అయిన ఖర్చు పెట్టారా ? అని ప్రశ్నించారు.బిజెపి ముందస్తు ఎన్నికలు కోరుకుంటే మేము రెడీగా ఉన్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు.

బిజెపి నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడం మానాలని హెచ్చరించారు.బిజెపి పార్టీలో జాయిన్ అవుతున్న వారు అంతా అవుట్ డేటెడ్ అని అన్నారు. కొంచెం బుద్ధి …జ్ఞానం తో బండి సంజయ్ మాట్లాడాలని సూచించారు.ముందు పార్లమెంట్ ను రద్దు చేయమననండి…మేము మా కేసీఆర్ తో మాట్లాడతాము అన్నారు.కేసీఆర్ ఒకలా మాట్లాడితే… బిజెపి నేతలు మరోలా మాట్లాడ్తున్నారని అన్నారు.