మాకు నచ్చినవాళ్లకే దళిత బంధు ఇస్తాం – మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

-

మాకు నచ్చినవాళ్లకే దళిత బంధు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి నిర్మల్ జిల్లా నర్సాపూర్-జి గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులకు దళిత బంధు ఇవ్వాలని కోరుతూ ఈమధ్య మంత్రి క్యాంప్ ఆఫీస్ తో పాటు కలెక్టరేట్ ను నరసాపూర్-జి గ్రామస్తులు ముట్టడించారు.

ఈ క్రమంలో నరసాపూర్-జి గ్రామానికి బతుకమ్మ చీరల పంపిణీ చేసేందుకు వెళ్లిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తమకు ఇష్టం వచ్చిన వాళ్లకు దళిత బంధు ఇస్తామంటూ మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు వచ్చేవరకు ఓపిక లేకుంటే ఏం చేయలేం అంటూ కామెంట్స్ చేశారు.

ఇచ్చింది ఎక్కువైతే ఇలాగే ఉంటది, ఒక్కసారిగా 10 లక్షలు ఇస్తే ఏం చేస్తావో చూపెట్టు’ అని ఓ మహిళను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిలదీశారు. దళిత బంధు అర్హులకు రాలేదని అడిగిన ఓ మహిళను బయటకు వెళ్లిపోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దళిత బంధుతో కార్లు, ట్రాక్టర్లు కొంటే అవి అన్నం పెడతాయా? రూ.10 లక్షలతో ఏం చేసి బతుకుతారు? మీకు ఏం అనుభవం ఉంది. చెబుతేనే దళిత బంధు ఇస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీరియస్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news