తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఆర్థిక వనరులు దేశంలో ఏ రాష్ట్రానికి లేవు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఆర్థిక వనరులు దేశంలో మరే రాష్ట్రానికి లేవు అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జిల్లా కేంద్రం లోని ఇందిరా భవన్ లో ఏఐసీసీ సెక్రటరీ, కుండర ఎమ్మెల్యే విష్ణునాథ్ తో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కర్ణాటక, రాజస్థాన్ రాష్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమిలు అమలుచేస్తున్నామని.. BRS ఇచ్చిన ఎన్నికల హామీల ను చూస్తే కాంగ్రెస్ 6 గ్యారెంటీ లా ను BRS రాజముద్ర వేసినట్టే ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రం లో ఒక్క నిరుపేదవాడికైనా ఇంటి స్థలం ఇచ్చావాని కేసీఆర్ ను ప్రశ్నించారు. BRS ఎన్నికల మేనిపెస్టి లో నిరుద్యోగ, ఉపాధ్యాయల, యువత,విద్యార్థుల ప్రస్తావన లేదు. KTR మాటలు నిరుద్యోగ యువకుల ఆత్మస్థైర్యం దెబ్బతిసేలా ఉంది. సామాజిక తెలంగాణ నిర్మాణంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని.. BRS ఎన్నికల మేనిపెస్టో చూస్తే కాంగ్రెస్ 6 గ్యారెంటీ ల కు కేసీఆర్ ఆమోద ముద్రవేశారని..  6 గ్యారెంటీ లు జస్ట్  ట్రైలర్ మాత్రమే సినిమా ముందు చూపిస్తాం అని తెలిపారు.  పసుపు మద్దతు ధర,చెక్కర ఫ్యాక్టరీ తెరిపించడం పై రాహుల్ గాంధీ పర్యటన చేయనున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news