ఇంటర్ పరీక్షలపై స్పందించిన బోర్డు..మళ్లీ పరీక్షలు అప్పుడే…!

తెలంగాణ ఇంటర్ ఫలితాలను నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేక పోవడం తో ఆందోళన మొదలయ్యింది. ఫెయిల్ అయ్యిన విద్యార్థులు మనస్తాపం తో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థి సంఘాలు కూడా ఈ విషయం పై ఆందోళనలు చేపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ స్పందించింది. ఫలితాలపై అనుమానం ఉన్నవాళ్లు జవాబు పత్రాలు పొందవచ్చని తెలిపింది. అంతే కాకుండా ఫలితాలపై అధికారికంగా తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని బోర్డు స్పష్టం చేసింది. పరీక్షల్లో సిలబస్ ను 70 తగ్గించామని అలాగే ప్రశ్నల్లో చాయిస్ ను కూడా పెంచామని గుర్తు చేసింది. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మళ్లీ ఏప్రిల్ లోనే పరీక్షలు నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చింది.