ఇప్పటికే నేనే టీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నా – జూపల్లి కృష్ణారావు

నాది మచ్చలేని చరిత్ర…అందుకే 5 సార్లు గెలిచానని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.కొల్లాపూర్ లో ప్రెస్ మీట్ లో జూపల్లి మాట్లాడుతూ.. కెఎల్ ఐ కాలువ పూడ్చివేత పై ప్రశ్నిచినందుకు..నా ప్రతిష్టను దిగజార్చేలా ఎమ్మెల్యే హర్షవర్ధన్ ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతకాక, ముఖం చాటేసేందుకు ఎమ్మెల్యే ఆయనను ఆయన అరెస్ట్ చేయించుకున్నారు… వాస్తవాలను విరుద్ధంగా నా పై ఆరోపణలు ఎమ్మెల్యే చేసాడని ఫైర్‌ అయ్యారు.

నేను అప్పులు చేసి వ్యాపారం చేసాను… కానీ తప్పులు చేయలేదని.. నాది మచ్చలేని చరిత్ర కాబట్టే… 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేశారు. పాలమూరు ప్రాజెక్ట్ గురించి కోర్టు లో కేస్ వేసింది నీవు కాదా.. విత్ డ్రా చేసుకొని మాట మార్చారని ఆగ్రహించారు. ఈ రోజు కూడా నేను టీఆరెస్ లోనే ఉన్నానన్నారు. సింగోటం బ్రిడ్జ్ నిర్మాణం కి 26 కోట్లు లబ్ది పొందలేదా..? ఇది పార్టీ సమస్య, ప్రభుత్వ సమస్య కాదన్నారు జూపల్లి కృష్ణా రావు.