సుప్రీం కోర్టును ఆశ్రయించిన కవిత

-

లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు అయిన కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యి నెలలు గడుస్తున్నా విషయం తెలిసిందే. అయితే ఈ కేసు కు సంబంధించి రోజుకో అప్డేట్ అనేది వస్తుంది. ఇక తాజాగా ఈ లిక్కర్ కేసులో బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు కవిత. అయితే సోమవారం సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ పై విచారణ జరపనుంది న్యాయస్థానం. ఇప్పటికే లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టు, హై కోర్టులు కవితకు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. దాంతో సుప్రీం కోర్టుకు వెళ్ళింది కవిత.

అయితే ఢిల్లి లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడి, ఏప్రిల్ 11న సీబిఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత… అనారోగ్యంతో 11 కిలోల బరువు తగ్గింది. అయితే మూడ్రోజుల క్రితం తీహార్ జైల్లో కవిత ను కేటీఆర్, హరీష్ రావులు కలిసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version