ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు చేదు అనుభవం ఎదురైంది. సిరిసిల్ల పర్యటనలో ఉండగా… కేఏ పాల్ పై టీఆర్ఎస్ కార్యకర్త దాడి చేశాడు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. సిరిసిల్లలో పంటనష్టంతో బాధపడుతున్న రైతులను పరామర్శించే సందర్భంలో ఈ దాడి జరిగింది. ఏకంగా డీఎస్పీ సమక్షంలోనే ఈ దాడి జరిగింది. పర్యటనలో ఉద్రికత్త తలెత్తడంతో సిద్ధిపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై కేఏ పాల్ ఫైర్ అయ్యారు.
తనపై జరిగిన దాడిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేస్తానని కేఏ పాల్ అన్నారు. తనపై దాడి చేయించింది కేసీఆర్, కేటీఆర్ అన్నారు. వాళ్లు ఎన్ కౌంటర్ చేయిద్దాం అని, చంపేయాలని ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు రాలేదని ఆయన విమర్శించారు. గత 8 ఏళ్లుగా అన్ని క్రైస్తవ మీటింగ్ లకు అనుమతిచ్చారు కానీ నాకు మాత్రం అనుమతి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. రైతులు, నిరుద్యోగుల ఉన్నారని వారందరిని ఆదుకుంటానని కేఏ పాల్ అన్నారు. నాకు 100కు 60-70 శాతం ఓటు బ్యాంకు ఉందని కేఏ పాల్ అన్నారు.