జీవన్ రెడ్డి మీ వయస్సు ఏంది..ఇంత దిగజారారు – కవిత కౌంటర్‌

-

జీవన్ రెడ్డి మీ వయస్సు ఏంది..ఇంత దిగజారారని ఫైర్‌ అయ్యారు కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ గెలిస్తే బతుకమ్మ మీద గౌరమ్మకు బదులుగా లిక్కర్ బాటిల్ పెడతారని జీవన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కవిత కౌంటర్ ఇచ్చారు. జీవన్ రెడ్డి గారు మీ వయస్సు ఏంది ,మీ గౌరవం ఏంది ఎలక్షన్ల కోసం ఇంత దిగజారి మాట్లాడతారా..అని ఫైర్‌ అయ్యారు. బతుకమ్మ పైన ఏదో పెట్టుకొని ఎగురుతారంటరా..? అని చురకలు అంటించారు. రాహులు గాంధీ ఒక పేపర్ టైగర్ అన్నారు.

kavith vs jeevan reddy

రాహుల్ గాంధీ, జీవన్ రెడ్డి కి నా రిక్వెస్ట్… మరొక్క సారి మీరు ఇలా దిగజారి మాట్లాడొద్దని కోరారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా ప్రజల అభ్యున్నతికోసం పనిచేస్తుందని…బిఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఉన్న పథకాలన్నింటిని అమలు చేస్తామని ప్రకటించారు. గల్ఫ్ లో మరణించిన కార్మికుల మృతదేహాలను తొందరగా వారి కుటుంబసభ్యులకు అందించే ఏర్పాటు చేస్తున్నామని.. తెలంగాణా లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.గల్ఫ్ లో ఉన్న సోదరులందరు వాపస్ రండి అని కోరారు.
కాంగ్రెస్ పార్టీ కి మనకు నమ్మక ద్రోహ బంధం ఉంది…వందలాది మంది తెలంగాణ బిడ్డలు చావుకు కారణమైది సోనియా గాంధి అన్నారు. రాహుల్ గాంధీ కాదు అతను ఎలక్షన్ గాంధీ అంటూ చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version