BRS పార్టీ ఆవిర్భావం..ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌

-

ఇవాళ BRS పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం. ఈ నేపథ్యంలోనే, ఉదయం 10 గంటల కల్లా తెలంగాణ భవన్ కు చేరుకోవాలని ప్రతినిధులకు పార్టీ సూచనలు చేసింది. ఇక ఇవాళ BRS పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం ఉన్న తరుణంలో తెలంగాణ భవన్ లో BRS జనరల్ బాడీ సమావేశం జరుగనుంది.

అయితే, ఇవాళ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్న నేపథ్యంలో..ఎమ్మెల్సీ కవిత ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో పిడికెడు మందితో ప్రారంభమై, ప్రత్యేక రాష్ట్రం సాధించి, తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపి.. నేడు దేశ ప్రగతి కోసం, రైతు రాజ్యం కోసం వడివడిగా అడుగులు వేస్తున్న బి ఆర్ యస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు. తెలంగాణ తల్లి విముక్తి కోసం ఆనాడు..భరతమాత బంగారు భవిత కోసం ఈనాడు..అంటూ కేసీఆర్‌ పై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news