కాంగ్రెస్‌లో కేసీఆర్ సీఎం..సరికొత్త కాన్సెప్ట్.!

-

తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్న బి‌జే‌పి..ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో ముందుకెళుతుంది. ఎలాగైనా కే‌సి‌ఆర్‌ని గద్దె దించడమే టార్గెట్ గా పెట్టుకుంది. ఈ క్రమంలో తమక్ఊ అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా బి‌జే‌పి వదలడం లేదు. ఇటీవల కాలంలో కాంగ్రెస్‌కు కే‌సి‌ఆర్ దగ్గరవుతున్నారనే ప్రచారం వస్తుంది. కేంద్రంలో బి‌జే‌పిపై పోరాడుతున్న కే‌సి‌ఆర్..కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారని తెలిసింది. ఈ క్రమంలో కాంగ్రెస్, బి‌ఆర్‌ఎస్ ఒక్కటే అని బి‌జే‌పి ప్రచారం చేస్తుంది.

అందుకే ఈటల రాజేందర్..తాజాగా ఊహించని వ్యాఖ్యలు చేశారు.  కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండూ ఒకటే అని, కాంగ్రెస్ మీద కేసీఆర్ ఈగ కూడా వాలనివ్వడం కూడా చూసుకునున్నారని,  రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచినా ముఖ్యమంత్రి అయ్యేది మాత్రం కెసిఆర్ నే అని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ప్రజల చేత ఛీత్కారం పొందిన పార్టీ బీఆర్ఎస్ అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు దౌర్జన్యాలు, దుర్మార్గాలు, పోలీసులను నమ్ముకున్నారని, ప్రతిపక్ష నేతలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని అన్నారు.

అయితే బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అనే నినాదంతో తెలంగాణ ఎన్నికల్లో లబ్ది పొందాలని బి‌జే‌పి చూస్తుంది. ఇక దీని వల్ల బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో తెలియదు గాని, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది..అందుకే కాంగ్రెస్..ఎప్పటికప్పుడు బి‌ఆర్‌ఎస్ తో పొత్తు ఉండదని చెప్పుకొస్తుంది..తాజాగా రాహుల్ గాంధీతో కూడా పొత్తు ఉండదని చెప్పించారు.

తెలంగాణలో రాజకీయ పరిస్తితులని చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే ప్రసక్తి లేదని చెప్పవచ్చు. అదే సమయంలో ఆ తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సీన్ మారే అవకాశం ఉంది. అప్పుడు బి‌జే‌పికి వ్యతిరేకంగా కే‌సి‌ఆర్..కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే ఛాన్స్ ఉంది. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version