అకాల వర్షాలు: రైతుల వద్దకు కేసీఆర్..భారీ సాయం..ఏపీలో నో కామెంట్!

-

అకాల వర్షాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. వేసవి కాలం మొదలవ్వడమే ఊహించని విధంగా అకాల వర్షాలు రెండు రాష్ట్రాలని ముంచెత్తాయి…ఓ వైపు వడగళ్ళ వాన..మరోవైపు ఈదురు గాలులతో వచ్చిన వానతో చేతికొచ్చిన పంట నెలకొరిగింది. కోతకు వచ్చిన వరి నెలకొరిగింది..మినుములు, ఎండుమిర్చి, పొగాకు, మామిడి..ఇతర కూర, పళ్ల తోటలు బాగా దెబ్బతిన్నాయి.

అయితే నష్టపోయిన తమని ఆదుకోవాలని రైతులు తమ సర్కారులకు గోడు వెళ్లబోసుకున్నారు. రైతులని తక్షణమే ఆదుకోవాలని రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో తెలంగాణలో నష్టపోయిన రైతులని ఆదుకునేందుకు డైరక్ట్ కే‌సి‌ఆర్ రంగంలోకి దిగారు. వరుసపెట్టి పలు జిల్లాల్లో పర్యటిస్తూ..నష్టపోయిన పంటలని పరిశీలిస్తూ..రైతులకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే ఖమ్మంలో పర్యటించిన ఆయన.. వడగళ్ల వానతో రాష్ట్రవ్యాప్తంగా పంటనష్టం జరిగిందిని, తెలంగాణలో 2,22,250 ఎకరాల్లో పంటనష్టం జరిగిందని, పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందొద్దు. రాష్ట్రంలో సమస్యలున్నాయని చెప్పినా కేంద్రం పట్టించుకోవట్లేదని,  కేంద్రానికి చెప్పినా, గోడకు చెప్పినా ఒకటే అని ఫైర్ అయ్యారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని,  కౌలు రైతులను కూడా ఆదుకుంటామని అన్నారు.

అయితే ఇంతవరకు ఏపీలో మాత్రం జగన్ సర్కార్ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు సాయం ప్రకటించలేదు. ఎంత నష్టం జరిగిందో అంచనా వేస్తామని, రైతులని ఆదుకుంటామని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు తప్ప..దీనిపై డైరక్ట్ గా జగన్ మాట్లాడింది లేదు..అలాగే పంట సాయం ప్రకటించలేదు..అసలు ఎన్ని వేల ఎకరాల్లో పంట దెబ్బతిందో లెక్కలు రాలేదు. అలాగే ఫీల్డ్ లోకి వెళ్ళి రైతులకు అండగా ఉంటారో లేదో చెప్పలేని పరిస్తితి. మొత్తానికి తెలంగాణ రైతులకు కాస్తో, కూస్తో సాయం అందుతుంది..కానీ ఏపీ రైతుల పరిస్తితి ఘోరంగా ఉంది .

Read more RELATED
Recommended to you

Latest news