ఉగాది పర్వదినం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. పంచాంగంలో ఏముందో కానీ సంతోష్ కుమార్ శాస్త్రి నోటి నుండి శుభం మాటలు వచ్చాయని.. సర్వ జనులకు సుఖం,శాంతి, ఐశ్వర్యం కలగాలని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగతంగా నాకు సంతృప్తి గా ఉందని… మనకు జాతి కులం లేదు… తెలంగాణ జాతి అంతా ఒక్కటే అన్నారు..
దేశ చరిత్రలో ఏ రాష్ట్రం సాధించని అద్భుత పలితాలు తెలంగాణ సాధించిందని…త్వరలోనే మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకువస్తామని ఆయన ప్రకటన చేశారు. బేధాలు సృష్టించే పనులు కొన్ని దుష్ట శక్తులు చేసాయని మండిపడ్డడారు. అద్భుతమైన సంపద సృష్టి జరిగింది.. భూముల విలువ పెరిగింది… హైదరాబాద్ లో 25 కోట్ల తో విల్లాలు బుక్ చేసుకుంటున్నారన్నారు.
అన్ని వర్గాలు బాగున్నప్పుడే సమాజం చక్కగా ముందుకు వెళ్తుందని.. దళిత బంధు అద్భుతాలు అవిష్కరించబోతోందని ప్రకటన చేశారు. దేశానికి అన్నం పెట్టే విదంగా తెలంగాణ ముందుకు వెళ్ళాలని.. దేశం లోనే గొప్ప బ్రాహ్మణులు తెలంగాణ లో ఉన్నారని పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని సంక్షేమ పథకాలు తెచ్చెందుకు కసరత్తు చేస్తామన్నారు.