పోలవరంపై కేంద్రానికి కేసీఆర్ సర్కార్ బహిరంగ లేఖలు !

-

తెలంగాణ నీటి సమస్యలపై కేంద్ర జలవనరుల శాఖ సెక్రటరీకి తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ మూడు లేఖలు రాశారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని లేఖ రాశారు. సీడబ్ల్యూసీ, ఎన్ఐహెచ్ సీఈలతో సాంకేతిక బృందం ఏర్పాటు చేయాలని లేఖ లో పేర్కొన్నారు ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్.

రాష్ట్ర అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. కేంద్రం జోక్యం చేసుకొని రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసిన రజత్ కుమార్.. కాళేశ్వరం అదనపు టీఎంసీ పనుల కాంపోనెంట్‌ను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

అనుమతుల్లేని ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. పనుల ప్రక్రియ గోదావరి బోర్డు త్వరగా పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ నిలిపివేయాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం.. కృష్ణా జలవివాదాల రెండో ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు నిలిపేయాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news