గృహ లక్ష్మి రాని అర్హులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. గృహ లక్ష్మి రాని వారిలో అర్హులను గుర్తించి మరోమారు ఇచ్చేలా చూసుకుంటామని ప్రకటించారు మంత్రి హరీష్ రావు. ఒకప్పుడు కరువు పడ్డది. కైకిలికి పోవాలని పోయేది. కానీ ఇవాళ, కరువు మాయమైంది. కైకిలోళ్లు దొరుకుతలేరనే పరిస్థితికి తెలంగాణ రాష్ట్రం చేరిందని కొనియాడారు హరీష్ రావు.
సిద్ధిపేట గ్రామీణ మండలం ఇర్కోడ్ గ్రామంలో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. అనంతరం ఇర్కోడ్ గ్రామంలో 24 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు మంత్రి హరీష్ రావు. ఈ గ్రామం చుట్టు పక్కల రైతులు, గ్రామస్తులంతా గతంలో క్రాప్ లోన్, బ్యాంకు సంబంధిత ఏ చిన్న పనులకైనా టౌన్ వెళ్లి వ్యయప్రయాసాలు పడేవారు, ఇర్కోడ్ కే యూనియన్ బ్యాంకు రావడంతో అందరికీ సౌలత్ అయిందని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు.