బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ రేపు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆయన ఆహ్వానించారు. కొద్ది రోజుల క్రితం ఫామ్ హౌస్ లో కాలుజారి పడటంతో ఆయన అసెంబ్లీలో ప్రమాణం చేయలేకపోయారు.
తుంటి ఎముక మార్పిడి సర్జరీ అనంతరం ఇటీవల కోలుకున్నారు. రేపు స్పీకర్ సమక్షంలో ప్రమాణం చేస్తారు. కాగా, స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమం ‘వంట అయినంక గరిటె తిప్పినట్లు’ ఉందంటూ హరీష్ రావు కామెంట్స్ చేసారు.
ఉద్యోగ భర్తీ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేశామని, తమ ప్రభుత్వ ఘనత గా నియామక పత్రాల జారీ పేరు తో కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడి చేస్తుండటం దౌర్భాగ్యం అని అన్నారు హరీష్ రావు.అలానే ఫిబ్రవరి 1, 2024 న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని, పత్రికల సాక్షిగా ప్రచారం చేసింది కాంగ్రెస్, దాని నుంచి విద్యార్థుల దృష్టి మార్చడానికి ముందు రోజున స్టాఫ్ నర్సులకు నియామకపత్రాల జారీ కార్యక్రమాన్ని హంగు ఆర్భాటంతో నిర్వహిస్తుందని అన్నారు హరీష్ రావు.