స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ద్విసాప్తహ లోగోని ఆవిష్కరించారు కే కేశవరావు. రవీంద్రభారతిలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ చరిత్ర ఎన్నో త్యాగాలతో నిండుకున్నదని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో యువత స్ఫూర్తి పొందాలన్నారు. ఇది ఎవరికీ పోటీ కాదని తెలియజేశారు. ఇక్కడి పరిస్థితులు, అభివృద్ధి, ప్రగతిని చెప్పుకోవలసిన అవసరం ఉందన్నారు కేశవరావు.
ఎవరికో పోటీగా చేస్తున్నామని అనడం భావ్యం కాదన్నారు. 15 రోజులపాటు మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురించాలని, ప్రసారం చేయాలని కోరారు. 15 రోజులపాటు అన్ని 562 థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించాలని కోరారు. 15 రోజుల్లో 25 నుంచి 30 లక్షల మంది విద్యార్థులు ఈ చిత్రం చూసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పూర్తి పండగ వాతావరణం వచ్చేలా రాష్ట్రం అంతా విద్యుత్ దీపాలంకరణ తో.. రక్షాబంధన్ రోజు సోదరా భావం పెంపొందెలా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.