తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులైన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి విచ్చేశారు మాణిక్ రావు ఠాక్రే. ఈ సందర్భంగా ఆయనకి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గాంధీ భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఠాక్రే పాల్గొన్నారు. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తో సమావేశమయ్యారు ఠాక్రే. అరగంట పాటు రేవంత్ రెడ్డి తో మీటింగ్ కొనసాగింది.
ఆ తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీలోని భట్టి, ఇతర సభ్యులు ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారు ఠాక్రే. మాజీ మంత్రి శ్రీధర్ బాబు, గీతారెడ్డిలతోపాటు 26 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలతో వేరువేరుగా సమావేశమయ్యారు. మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి లు హాజరుకావాలని పార్టీ కార్యాలయం నుంచి సమాచారం అందింది. రెండు రోజులపాటు హైదరాబాద్ లోనే మకాం వెయ్యనున్నారు ఠాక్రే. నేడు సాయంత్రం సీనియర్ నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం.