ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

-

నేడు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ, రాష్ట్ర కార్యవర్గంతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ఫార్మ్ హౌస్ కేసులోని ఎమ్మెల్యేలను కూడా సీఎం కేసీఆర్ తన వెంట తీసుకుని వచ్చారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు పలు కీలక సూచనలు చేశారు.

నేటి నుంచి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా ఫీల్డ్ లోనే ఉండాలని సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. క్యాలెండర్ వేసుకుని పని చేయాలని, నిత్యం ప్రజల్లోనే ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఇక తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని, షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని మరోసారి స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఎన్నికలకు గట్టిగా ఏడాది ఉందని, అందరూ కష్టపడాలని సూచించారు.

బిజెపితో ఇక యుద్ధమేనని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. ఇక మంత్రులు జిల్లా కేంద్రాలలో ఉంటూ పర్యవేక్షించాలని.. నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితులపై ఆరా తీయాలని ఆదేశించారు. పార్టీ, ప్రభుత్వ పరంగా ఉన్న లోటుపాట్లను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news