పువ్వాడ ముఖ్యమా…? ప్రజలు ముఖ్యమా..? కేసీఆర్ తేల్చుకోవాలి: జగ్గారెడ్డి

-

ఖమ్మం ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి పువ్వాడ అజయ్ ను బర్త్ రఫ్ చేయాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మంత్రి పువ్వాడ అజయ్ అనేక అరాచకాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారుడ. కాంగ్రెస్ నేతలపై పీడీ యాక్ట్ పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. పువ్వాడ అజయ్ మెడికల్ కాలేజీలో అవకతవకలు జరిగాయని.. దాని మీద విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధిస్తుంటే సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మంత్రి పువ్వాడ ముఖ్యమా… ప్రజలు ముఖ్యమా సీఎం కేసీఆర్ తేల్చుకోవాలని అన్నారు.

jaggareddy | జగ్గారెడ్డి
jaggareddy | జగ్గారెడ్డి

పువ్వాడకు కోర్ట్ నోటీసులు  ఇచ్చిన చలనం లేదని.. న్యాయస్థానాలు అంటే విలువ లేదని జగ్గారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం నాన్చడు ధోరణి మంచిది కాదని ఆయన హితవు పిలికారు. మంత్రి పువ్వాడ ఒక్కడే కమ్మ కాదని… చనిపోయిన వ్యక్తి కూడా కమ్మ యువకుడే అని జగ్గారెడ్డి అన్నారు. కులం పేరు చెప్పడానికి మంత్రికి సిగ్గు అనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. రేణుకా చౌదరి కూడా కమ్మ వ్యక్తే అని నిన్ను విమర్శించడం లేదా అని ప్రశ్నించారు. ఓ ప్రాణం పోవడం చిన్న విషయమా… బుర్ర ఉందా నీకు అని జగ్గారెడ్డి మంత్రి పువ్వాడపై ఫైర్ అయ్యాడు. ఖమ్మంలో పువ్వాడ ఆస్పత్రిని ముట్టడిస్తామని… పువ్వాడను ఎక్కడా తిరగనీయకుండా చేస్తామని హెచ్చిరించాడు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news