సీఎం కేసీఆర్ కి బహిరంగ లేక రాశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. లక్షల మంది నిరుద్యోగుల అవస్థల గురించి లేఖలో వివరించారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు..? అని ప్రశ్నించారు. వారం రోజుల్లో డీఎస్సీ ప్రకటన చేయాలని.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడిస్తామని లేఖలో హెచ్చరించారు కోమటిరెడ్డి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఏం జరుగుతుంది..? నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాగిన ఉద్యమకాంక్షలు ఎక్కడ నెరవేరాయని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు అక్కడే వదిలేశారని.. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. అనవసర ఆర్భాటాలకు పోయి ప్రజాధనం వృధా చేస్తున్నారని లేఖలో ఆరోపించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.