తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే తో భేటీ అయ్యారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కొత్త ఇన్చార్జి వచ్చినప్పటి నుంచి జగ్గారెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే ఈ విషయం ఠాక్రే దృష్టికి వెళ్లడంతో ఆయనే స్వయంగా జగ్గారెడ్డి కి ఫోన్ చేసి పిలిపించుకున్నారు. అయితే ఈ భేటీలో ఏ అంశంపై చర్చించారని విషయం తెలియ రాలేదు.
ఇక భేటీ అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మర్యాదపూర్వకంగానే ఠాక్రేను కలిసినట్లు తెలిపారు. ఇక వారి మధ్య అనేక రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు జగ్గారెడ్డి. కానీ పార్టీలోని అంతర్గత విషయాలపై చర్చ జరగలేదన్నారు. మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి మాటలను వక్రీకరించారని, ఆయన చెప్పింది ఒకటైతే మీడియాలో మరొకటి వచ్చిందని అన్నారు జగ్గారెడ్డి. అది ప్రజలకు మరోలా అర్థమైంది అన్నారు. ఎవరు ఏం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగదని.. కాబట్టి దీనిపై వివాదం అవసరం అన్నారు.