కాంగ్రెస్ కార్యకర్తలను టచ్ చేస్తే..క్రేన్‌కు ఉరి తీస్తా – కొండా మురళి

-

కాంగ్రెస్‌ కార్యకర్తలను టచ్ చేస్తే..క్రేన్‌కు ఉరి తీస్తానని వార్నింగ్‌ ఇచ్చారు కొండా మురళి. తన భార్య కొండా సురేఖ పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. ఎవరు ఎన్ని మాట్లాడిన వరంగల్ తూర్పు నుంచే… కాంగ్రెస్ పార్టీ తరఫున కొండా సురేఖ పోటీ చేస్తుందని వెల్లడించారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.మా కార్యకర్తలను టచ్ చేస్తే పోలీసులకు చెప్పి మరీ క్రేన్‌కు ఉరి తీస్తానంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

పోలీసులు చర్యలు తీసుకోకపోతే నాలోని పాత కొండా మురళిని చూస్తారని హెచ్చరించారు వరంగల్ కాంగ్రెస్ లీడర్ కొండా మురళి. ఎర్రబెల్లి స్వర్ణ వర్గానికి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన కొండా మురళి.. అధికార పార్టీ నాయకులు తమ కార్యకర్తల జోలికి వస్తే ముందు సిపికి ఫిర్యాదు చేస్తామని.. తర్వాత ఏసీపి కి ఫిర్యాదు చేస్తాం, తర్వాత సిఐ తర్వాత ఎస్సై తర్వాత కానిస్టేబుల్ అయినా న్యాయం జరగకుంటే క్రేనుకు కట్టేసి తమ ప్రతాపం చూపిస్తామన్నారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. కొంతమంది నాయకులు కొండ మురళి పని అయిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version