నా కాళ్లు మొక్కితేనే.. రేవంత్‌ కు పీసీసీ పదవి – కౌశిక్‌రెడ్డి సంచలనం

-

రేవంత్ రెడ్డి నిన్ను పీసీసీ ప్రెసిడెంట్ చేయమని నా ఇంటికి వచ్చి నువ్వు నా కాళ్లు మొక్కిన విషయం మర్చిపోయావా అంటూ రెచ్చిపోయారు టీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. నిన్న సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును యావత్ తెలంగాణ ప్రజలు చూశారని.. నా ఇంటి పైన దాడి సిఎం రేవంత్ రెడ్డి చేపించాడని ఆగ్రహించారు. నన్ను సిఎం రేవంత్ రెడ్డి హత్య చేయాలని అనుకుంటున్నాడని… తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని పేర్కొన్నారు.

koushik reddy fires cm revanth reddy

ప్రభుత్వం ఇచ్చిన హామీల పై ప్రజల తరుపున నేను ప్రశ్నిస్తుంటే నన్ను చంపాలని చూస్తున్నారని… సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి పైన హత్య యత్నం కేసు నమోదు చేయాలని డీజీపీనీ డిమాండ్ చేస్తున్నామని… సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి కుటుంబానికి మంచి పేరు ఉందని వివరించారు. అవినాశ్ మహంతి తమ్ముడు కరీంనగర్ సిపి డైనమిక్ గా పనిచేస్తున్నాడని…కానీ అవినాశ్ మహంతి మాత్రం ఇక్కడ సరిగా చేయడం లేదన్నారు. మాదాపూర్ లో FTL పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు ఉన్నదని…ఎటువంటి నోటీసుల ఇవ్వకుండా పెదోళ్ళ ఇల్లు కూలగొడుతున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version