సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

-

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు తాాజాగా సావాల్ విసిరారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ పోటీ చేద్దాం.. నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తా.. నువ్వు కోడంగల్ ఎమ్మెల్యే పదవీకి.. తెలంగాణ ముఖ్యమంత్రి పదవీకి రాజీనామా చేసి పోటీ చేయాలి అని సవాల్ విసిరారు.

 

మరోవైపు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ మల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసరడం ఇప్పుడు సంచలనంగా మారింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించాడు. అంతకు ముందు చామకూర మల్లారెడ్డి టీడీపీ నుంచి విజయం సాధించి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. మల్లారెడ్డి కంటే ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వే సత్యనారాయణ మల్కాజ్ గిరి ఎంపీగా కొనసాగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version