మీకు శుభం కలుగుగాక.. తెలంగాణ ఫలితాలపై కేటీఆర్ ట్వీట్

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయతీరాలకు చేరుతోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమయ్యే క్షణాలు చాలా దగ్గరలో ఉన్నాయి. హస్తం పార్టీ క్లీన్ స్వీప్ చేసేలా కనిపిస్తోంది. ఇప్పటివరకే చాలా నియోజకవర్గాల్లో హస్తం అభ్యర్థులు గెలుపు సాధించారు. దాదాపు గెలుపు ఖాయమైన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు సంబురాల్లో మునిగి తేలుతున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ స్పందించారు. బీఆర్ఎస్‌కు వరుసగా రెండు సార్లు ప్రభుత్వాన్ని అందించినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఫలితం గురించి బాధపడలేదని.. కానీ అది తాము ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కచ్చితంగా నిరాశ చెందానని చెప్పారు. తాము దీన్నొక పాఠంగా తీసుకుని, తిరిగి పుంజుకుంటామని చెప్పారు. ‘ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాను’ అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కేటీఆర్ ట్వీట్‌పై రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌ గెలుపును కేటీఆర్‌ స్వాగతించారని.. ఆయన స్పందనను స్వాగతిస్తున్నానని చెప్పారు. విపక్షాలు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని రేవంత్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version