కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, మతకల్లోలాలు అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎల్బీనగర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆయన… కర్ణాటక రైతులు TSకు వచ్చి ఇక్కడి రైతుల్లో చైతన్యం నింపుతున్నారని తెలిపారు. తాము కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేశామని, తెలంగాణ ప్రజలు ఆ తప్పు చేయొద్దని కోరుతున్నారని వివరించారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోను కలుపుతూ పెద్ద అంబర్పేట్ వరకు విస్తరిస్తామని కేటీఆర్ ప్రకటించారు.
ప్రజలను కలిసినప్పుడు 2014లఎట్లా ఉండే… ఇప్పుడు ఎట్లా ఉంది అని అడగాలన్నారు కేటీఆర్. హైదరాబాద్ మహా నగరంను విశ్వ నగరంగా మార్చే క్రమంలో అడుగులు ముందుకు వేస్తున్నామని వెల్లడించారు. గతంను మరిచి పోయి గందరగోళం పడిపోతాం… ఇది మానవ నైజం అన్నారు. 2014కు ముందు 10 గంటలు కరెంట్ పోయిన అడిగేవాడు వాడు… చెప్పే వాడు లేడని చెప్పారు కేటీఆర్. ఇప్పుడు 10 నిముషాలు కరెంట్ పోతే ఇదేనా బంగారు తెలంగాణ అని సోషల్ మీడియాలో పెడుతున్నారు. కర్ణాటకలో ప్రజలు కరెంట్ లేక రోడ్లు ఎక్కుతున్నారు అన్నారు కేటీఆర్.