దమ్ముంటే రా మరి..! యాదగిరి గుట్ట.. భాగ్యలక్ష్మి టెంపులా.. నేనురెడీ -కోమటిరెడ్డి వెంకటరెడ్డి

-

దమ్ముంటే రా మరి..! యాదగిరి గుట్ట.. భాగ్యలక్ష్మి ఆలయం.. ఇంకా వరంగల్ భద్రకాళి.. బాసర సరస్వతి మాత.. ఇలా ఎక్కడికైనా నేను రెడీ..!ఎప్పుడంటే అప్పుడు.. ఎక్కడంటే అక్కడికి నేను రెడీ.. మరి నువ్వు రెడీనా..? అని కేటీఆర్ కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. నిన్న కేటీఆర్ కోమటిరెడ్డి బ్రదర్స్ కోవర్ట్ లు అంటూ అన్న మాటలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు.


నల్గొండ ఫ్లోరోసిస్ బాధితులకి అండగా నిలబడ్డది నేనైతే.. వాళ్లకు తాగునీళ్లు లేకుండా చేస్తున్నది మీరేనని కూడా జనానికి బాగా తెలుసు..!మరి నీ వైపు ఇన్ని తప్పులు పెట్టుకుని.. తెలంగాణ ఉద్యమ సారథిని.. ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడ్డ నన్ను కోవర్ట్ అనటానికి నీకు సిగ్గుగా లేదా కేటీఆర్?అసలు నా మీద బురదజల్లే నీకు.. ఇంత వైభోగమెలా వచ్చింది? పట్టుమని పదెకరాలు లేని నీకు వేలకోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో.. నువ్వు ఒట్టేసి చెప్పగలవా..? ఆ దమ్ముందా..? అని ఫైర్ అయ్యారు.

ఒక్కమాటలో చెప్పాలంటే..! కాళేశ్వరంతో పాటు ప్రతి ప్రాజెక్ట్ లోనూ కమిషన్లు బొక్కే కల్వకుంట్ల ఫ్యామిలీ నీది.. ఇంకా చెప్పాలంటే…కోమటిరెడ్డి అంటే నిజాయితీకి మారుపేరు అన్నారు. కల్వకుంట్ల అంటే కమీషన్లకు మారుపేరు.. కాదని చెప్పే దమ్ముందా నీకు కేటీఆర్ ? అని నిలదీశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news