మేడిగడ్డను త్వరలో సందర్శిస్తాం.. విజువల్స్ తీసుకు వచ్చి ప్రజలకు వివరంగా చెప్తామని ప్రకటించారు కేటీఆర్. మేడిగడ్డ కొట్టుకు పోయిందని.. కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగ పాలైందని చెప్పి చిల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ సిగ్గుతో తల దించుకోవాలని చురకలు అంటించారు. మేము మొదటి నుండి ఒక్కటే చెప్పినం.
అక్కడ జరిగింది చిన్న విషయమే పెద్దది కాదని చెప్పాము…. ఈరోజు వరద నీరు వచ్చిన కూడా తట్టుకొని మేడిగడ్డ నిలబడటమే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క గొప్పతనమని చెప్పారు కేటీఆర్. పోలీసులు సిటీ సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులను బైటకు ఈడ్చుకురావటం.. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్న విద్యార్థులపై దాడి చేయటం గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. గవర్నర్ కూడా చాలా గట్టిగా స్పందించారు.. హోమ్ సెక్రటరీని పిలిపించి మాట్లాడుతాం అన్నారని వివరించారు కేటీఆర్. హామీలు అమలు చేయాలన్న విద్యార్థుల మీద నిర్భంధం, అణిచివేత, అరెస్ట్ లు, అక్రమ కేసులతో భయానక వాతావారణం పునరావృతం చేస్తున్నారని చెప్పామన్నారు.